ప్రపంచం గర్వించదగ్గ నటుడు మెగాస్టార్ చిరంజీవి

  • ఘనంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన జిల్లా చిరంజీవి యువత
  • మెగాస్టార్ చిరంజీవి కి భారతరత్న ఇవ్వాలని అతిధులు డిమాండ్
  • జిల్లా చిరంజీవి యువత మరియు అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు
  • చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా నడక పోటీలను నిర్వహించిన అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్

విజయనగరం, మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ సినీనటులు, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా జిల్లా చిరంజీవి యువత అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం మరియు అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఉదయం స్థానిక అంబేద్కర్ సామాజిక భవనంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) ఘనంగా నిర్వహించారు. ముందుగా నిర్వాహకులు ఉదయాన్నే చిరంజీవి గోత్రనామాలతో శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలాజీ జంక్షన్ వద్దనున్న అంబేద్కర్ సామాజిక భవనంలో ముఖ్యఅతిధిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి సీనియర్ అభిమాని, వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ -3 జి. కృష్ణంరాజు కేక్ కట్ చేసి చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ చిరంజీవి స్వయంకృషితో ఎవ్వరి సహకారం లేకుండా సినీపరిశ్రమలో కష్టపడి మెగాస్టార్ స్థాయికి ఎదిగిన మహానుభావుడని, సమాజం మనకి ఏమిచ్చిందని కాకుండా సమాజానికి మనమేమి చేసాం అనే ధోరణిలో గొప్ప ఆలోచనచేసి, తమ అభిమానులను సైతం సేవామార్గంలో నడిపించే గొప్ప మనసున్న మగమహారాజు అని, అందుకే చిరంజీవి భారతదేశమే కాకుండా ప్రపంచం గర్వించదగ్గ గొప్ప నటుడు చిరంజీవి అని అన్నారు. మరో విశిష్ట అతిధిగా హాజరైన జనసేన పార్టీ సీనియర్ నాయకులు అదాడ మోహనరావు మాట్లాడుతూ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆశయాలను సేవారూపంలో ప్రజల్లోకి తీసుకెల్తూ సమాజాసేవలో మెగాఫ్యామిలీ అభిమానులే ముందున్నారని అంటూ మెగాభిమానులు చేసే సేవలను కొనియాడుతూ ఇంతగొప్ప సేవామూర్తి చిరంజీవికి భారతరత్న ఇచ్చి ఆయన్ను గౌరవించిన నాడే తనసేవలకు సార్ధకత అని అన్నారు. అనంతరం చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా నిర్వహించిన నడక పోటీల్లో గెలుపొందిన విజేతలకు వాకర్స్ ఇంటర్నేషనల్ సర్టిఫికెట్స్ ముఖ్య అతిధిగా విచ్చేసిన జి కృష్ణంరాజు చేతులమీదుగా అందించారు. జనసేన నాయకులు అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం గౌరవధ్యక్షలు పిడుగు సతీష్, అధ్యక్షులు కొయ్యాన లక్ష్మణ్ యుదవ్, కార్యదర్శి లోపింటి కళ్యాణ్, జనసేన నాయకులు, ఆర్గనైజింగ్ కార్యదర్శి శీర కుమార్, జనసేన నాయకులు దంతులూరి రామచంద్ర రాజు, సభ్యులు యాతపేట రవి, కులదీప్ తదితరులు పాల్గొన్నారు.