అన్యాయాన్ని ప్రశ్నించిన పాలవలస

విజయనగరం: పోలీస్ ల జులుం యథేచ్ఛగా వైసీపీ ప్రభుత్వములో కొనసాగుతుంది . విజయనగరంలో స్థానిక కంటోన్మెంట్ (బొగ్గులదిబ్బ) ప్రాంతములో 50 ఏళ్లుగా ఉన్నకుటుంబాలను ముందస్తు నోటీసులు ఇవ్వకుండా శుక్రవారం సడన్ గా జేసీబీ లు తీసుకువచ్చి సుమారు 50 కుటుంబాలను రోడ్డున పడేసారు. జరుగుతున్న అన్యాయాన్ని స్థానిక ప్రజలు అడుగుతున్నా పట్టించుకోకుండా వాళ్ళందరినీ రోడ్డు మీద పడేసి ఇళ్ళుకూల్చి వేస్తుండగా స్థానికులు ఈ విషయాన్ని జనసేన పార్టీ విజయనగరం ఇంచార్జీ శ్రీమతి పాలవలస యశస్వికి తెలియజేశారు. వెంటనే యశస్వి వెళ్లి అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి.. ప్రజలకు అండగా నిలబడ్డారు. అక్కడున్న పోలీస్ లు మరియు సీ.ఐ దురుసుగా ప్రవర్తించి మహిళ అని అడ్వకేట్ అని చూడకుండా, దౌర్జన్యంగా మాట్లాడి, బెదిరించి ఆవిడను స్టేషన్ కు తరలించడము, ఆమెతో పాటు పలువురు జనసైనికులను రిమాండ్ కు తీసుకోవడము దురదృష్టము. సి.ఐ వెంకటరావు చేసిన అరాచక విధానాలను నిరసిస్తూ యశస్వి దిశ పోలీస్ స్టేషన్ లో మరియు ఎస్.పి కి పిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాల జనసేన నాయకులు, వీరమహిళలు ఆమెకు తోడుగా నిలిచారు.