నేడు రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన

రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఈరోజు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా జెడ్పీ పాఠశాల, రైతు వేదిక భవనాలను కేటీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష చేయనున్నారు. మంత్రి పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.