TV ఉంటే రేషన్‌కార్డు బంద్‌పై వెనక్కి తగ్గిన మంత్రి

టీవీ, ఫ్రిజ్‌ లాంటి వస్తువులుంటే రేషన్‌ కార్డులు వదులుకోవాలంటూ కర్ణాటక మంత్రి ఉమేశ్ కత్తి చేసిన ప్రకటన తీవ్ర దుమారానికి దారితీసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలపై మంత్రి వెనక్కి తగ్గారు. రేషన్‌ బియ్యం కార్డుల కోసం ఎలాంటి కచ్చితమైన పరిమితులు లేవని, కార్డుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

తన వ్యాఖ్యలపై నేడు స్పందించిన మంత్రి ఉమేశ్‌.. ‘దిల్లీ నుంచి నాకు వచ్చిన సమాచారాన్ని నేను మీడియాతో పంచుకున్నారు. టీవీ, ఫ్రిజ్‌ లాంటి పరామితులపై నేను గానీ, ముఖ్యమంత్రి యడియూరప్ప గానీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వడంలేదు. మా ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు కట్టుబడి ఉంది’ అని చెప్పారు. దీనిపై మరింత వివరణ ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు.

బెళగావిలో సోమవారం జరిగిన ఓ మీడియా సమావేశంలో ఉమేశ్ మాట్లాడుతూ రేషన్‌ కార్డులపై సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. టీవీ, ఫ్రిజ్‌, ద్విచక్రవాహనం, ఐదెకరాల భూమి ఉన్నవారు బీపీఎల్‌ రేషన్‌ కార్డులు