మైనార్టీల పధకాలకు ముస్లిం పెద్దల పేర్లు పెట్టాలి

ప్రభుత్వ పథకాల్లో భాగంగా ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తున్నదో ఆయా పార్టీల నాయకుల పేర్లు తాతల, తండ్రుల, మామల పేర్లు పెట్టడం చూస్తూ వస్తున్నాం. దీనిలో భాగంగానే ప్రస్తుతం జిల్లాల పేర్లు, ఆరోగ్య పథకాల పేర్లు మార్పును చూస్తున్నాం. ఒక ముస్లిం మైనారిటీగా అడుగుతున్నా ముస్లిం నాయకులు ఎవరూ మీ కంటికి కనబడడం లేదా..? ముస్లిం సహోదరుల్లారా మిమ్మల్నే అడుగుతున్నా ఎన్ని రోజులు ఈ రాజకీయ క్రీడలో అలుసు అవుతానే ఉంటాం. ఆ పార్టీ ఈ పార్టీ అని కొట్టుకుని చావడం తప్ప ఏనాడైనా జాతి ఔన్నత్యం కోసం ముస్లిం నేతలు, నాయకుల పేర్లు పెట్టే ఆలోచనైనా చేసామా..? స్వాతంత్ర్య సమరంలో అసువులు బాసిన ఫ్రీడమ్ ఫైటర్స్ మరియు ముస్లిం జాతి ఔన్నత్యాన్ని చాటిన చాలా మంది ముస్లిం పెద్దలు ఉన్నా వారిని పేరుకు మాత్రమే సరిపెట్టాం, ఎప్పుడూ ముస్లిం మైనారిటీల పధకాల విషయంలో ముస్లింల పేర్లు పెట్టకుండా వీరి పేర్లే పెడుతూ వస్తున్నారు. ఈ విషయాన్ని ప్రశ్నించాలి. ఒక జనసైనికుడిగా జనసేన అధికారంలోకి వస్తే ఈ పేర్లు ఉండాలని అధినేత పవన్ కళ్యాణ్ ని కోరుతున్నా అని ముస్లిం మైనారిటీ ఎన్నారై జనసేన నాయకులు అలి షేక్ తెలిపారు.