దళితులను చిన్న చూపు చూస్తున్న ఎమ్మెల్యే కోన రఘుపతి: గాదె

గుంటూరు: బాపట్ల నియోజకవర్గం పక్కనే ఉన్న మరుప్రోలు వారి పాలెం అనే గ్రామం నందు దాదాపు 100 దళిత కుటుంబాలను ఈ వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం గాదె విలేకరులతో మాట్లాడుతూ మరుప్రోలు వారి పాలెం గ్రామంలో దళితులు మరియు రెడ్డి సామాజికవర్గాల వారు నివసిస్తుంటే.. వీరిలో ఈ ప్రభుత్వం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలాలను కేటాయించి, దళితులకు మాత్రం కేవలం ఐదు కుటుంబాలకు స్థలాలు ఇచ్చామని చెప్పి అవి కూడా ఇవ్వకుండా లాక్కున్నారని ఆయన తెలిపారు. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ ప్రసంగాలు చేసుకోవడమే జగన్.. నిజమైన పేదలకు ఇళ్ల స్థలాలను అందించకుండా అన్ని ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి మాత్రం ఇవ్వడంలో నీ ఉద్దేశం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతికి ఈ గ్రామం అసలు కనబడటంలేదా? ఒక చిన్న గుడిసెలో ఐదుగురు కుటుంబాలు నివసిస్తుంటే వీరిలో ఎవరికి ఇళ్లస్థలాలను కేటాయించకుండా పెద్ద పెద్ద గృహాలు ఉన్న వారికి స్థలాలు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలియజేశారు. మీరు (స్థానిక ఎమ్మెల్యే) వీరి (దళితుల) ఓట్లతో గెలిచి వీరిని చిన్న చూపు చూడటం సమంజసం కాదు. స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి మెడికల్ కళాశాల ఎవరికీ అవసరం లేదు. దయచేసి ఇటువంటి పేదలను కాస్త పట్టించుకోవాలని ఆయన తెలిపారు. కచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం వస్తుంది పేదల నిజంగా సంతోషంగా ఉండే రోజులు ముందే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.