రామగుండం నియోజకవర్గ జనసేన ఇంచార్జిగా మూల హరీష్ గౌడ్

రామగుండం నియోజకవర్గం: రామగుండం జనసేన పార్టీ ఇంఛార్జి గా మూల హరీష్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ జనసేన పార్టీ కార్యాలయం నుంచి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ధ్రువపరిచిన నియామక ఉత్తర్వులు మంగళవారం వెలువడ్డాయి. రామగుండం నియోజకవర్గ కేంద్రానికి చెందిన మూల హరీష్ గౌడ్ గతంలో తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ యూత్ వింగ్ కార్యదర్శిగా, రామగుండం నియోజకవర్గం కోఆర్డినేటర్ గా పెద్దపల్లి పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా బాధ్యతలు నిర్వహించారు. వారి నియమకానికి సహకరించిన జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, తెలంగాణ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, రామ్ తల్లూరి, రాజలింగం లకు హరీష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. హరీష్ గౌడ్ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.