మోడల్ స్కూల్ నందు టీచర్స్ ను నియమించాలి: సిజి రాజశేఖర్

  • జనసేన ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి బైపాస్ రోడ్డు నందు ధర్నా

పత్తికొండ: జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు సిజి రాజశేఖర్ మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వానికి జగన్ రెడ్డికి స్కూళ్లకు కలర్లు వేయడంపై ఉన్న శ్రద్ధ టీచర్స్ ను నియమించాలన్న ఆలోచన ఎందుకు లేదు జగన్ రెడ్డి మాత్రం నాడు నేడు కింద మేము స్కూల్ అభివృద్ధి చేశాం అంటున్నారు. అభివృద్ధి అంటే రెండు ఫ్యాన్లు రెండు కుర్చీలు కలర్లు వేయడం కాదు. వీటితోపాటు స్కూల్లో మంచి టీచర్లను నియమించడం. ఈ ప్రభుత్వంలో టీచర్లను నియమించరు. ఉదాహరణకు మన పత్తికొండ మోడల్ స్కూల్ నిదర్శనం ఈ స్కూల్ సమస్య సీఎం జగన్మోహన్ రెడ్డికి అర్థం అయ్యే విధంగా రేపు తెలియజేస్తాం. పత్తికొండ లో ఉన్నటువంటి మోడల్ స్కూల్ నందు టీచర్స్ ను నియమించాలని, మనం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మొదట ఆర్డీవో కి మరియు అలాగే జాయింట్ కలెక్టర్ కి జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందజేసి టీచర్లను నియమించాలని తెలియజేసినప్పటికీ ఇప్పటివరకు టీచర్స్ నియమించలేదు మన కళ్ళ ముందే విద్యార్థి జీవితాలు సర్వ నాశనం అవుతుంటే ఎలా చూస్తూ కూర్చుంటాం వైసీపీ ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ఈరోజుతో ముగియడంతో రేపు పత్తికొండ జనసేన పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థుల మోడల్ స్కూల్ నందు ఈ ఇంతమంది టీచర్లను టి జి టి మాథ్స్, పిజిటి మాథ్స్, పిజిటి బోటనీ, పిజిటి జువాలజీ, కంప్యూటర్ టీచర్ లేరు. అలాగే ఆఫీస్ స్టాఫ్, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ చేసేవారు లేనందువలన ఈ టీచర్లను వెంటనే నియమించాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టాం. మరి ముఖ్యంగా ఈ స్కూల్లో చదువుతున్న 700 మంది విద్యార్థులు జీవితాలు సర్వం నాశనం చేస్తున్న ఈ వైసిపి ప్రభుత్వానికి ఈ జగన్మోహన్ రెడ్డి కి కనువిప్పు కలిగే విధంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని భాగస్వాములు కావలసిందిగా కోరుచున్నాము. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కానీ విద్యార్థులకు విద్యనే అందుకుంటే వారి జీవితాలు ఎలా బాగుపడతాయి వారి కుటుంబ జీవితాలు ఎలా మెరుగుపడతాయని, పిల్లలతో పాటు ప్రతి ఒక్కరు అలాగే బాధ్యత గల ప్రతి ఒక్కరు కూడా అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైనది. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. మోడల్ స్కూల్లో విద్యార్థులకు బోధించేవారు లేక విద్యార్థులు చదువుకోలేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మరి కొందరు విద్యార్థులు చదువుకోలేక మధ్యలోనే ఆపేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్ కి వెళ్దామంటే ఫీజులు కట్టలేని పరిస్థితిలో పిల్లల తల్లిదండ్రులు ఇదే స్కూల్లో ఉంచారు. మరికొందరు వేరే స్కూల్లో జాయిన్ చేయించారు. గత సంవత్సరం నుంచి టీచర్లు లేనందువల్ల బోధించేవారు లేక విద్యార్థుల జీవితాలు ఒక సంవత్సరం వేస్ట్ అయినందువలన విద్యార్థులకు విద్యార్థులు తల్లిదండ్రుల తరఫున జనసేన పార్టీ వారందరికీ అండదండగా ఉండాలని ఈ ప్రభుత్వం ఈ స్కూలు నందు టీచర్లను ఎట్టి పరిస్థితుల్లో నియమించాలని ఈ 11వ తారీకు శుక్రవారం ఉదయం 9:30 లకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డు నందు విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి, స్కూల్లో టీచర్స్ ను నియమించాలని, బైపాస్ రోడ్ లో ధర్నా చేపట్టడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.