జనసేన పార్టీ నిరసనలతో వైసిపి నేతలు, కార్పొరేషన్ అధికారులలో చలనం..

  • నిరసనకు ముందుగానే పంట బోదే తూడు తొలగింపు చర్యలు
  • ఫేజ్-1,పేజ్-2 నిధులతో డివిజన్ లలో సమస్యలుపరిష్కారం కాలేదు-ఏలూరు జనసేన పార్టీ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆరోపణ

ఏలూరు: జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏలూరు 18వ డివిజన్ లో శుక్రవారం సబ్ కెనాల్ పంట బోదేను శుభ్రం చేయాలని తలపెట్టిన నిరసన కార్యక్రమానికి డివిజన్ ప్రజల నుండి విశేష స్పందన లభించింది.. ఏడాది జనసేన పోరు బాట కార్యక్రమంలో భాగంగా వంగాయ గూడెం అంబేద్కర్ బొమ్మ వెనకాల పంట కాలువ సమస్యను పరిష్కరించమని జనసేన పార్టీ తరపున నగరపాలక సంస్థ అధికారులకు మార్చ్ 3న వినతిపత్రం ఇచ్చామని, దీనిపై త్వరలో పంట కాలువను శుభ్రం చేస్తామని అధికారులు తెలిపారని, కానీ మార్చి 27 వరకు అధికారులు స్పందించకపోవడంతో జనసైనికులే చందాలు వేసుకుని, మార్చి 28వ తేదీన ప్రోక్ లైనర్ తో పంట కాలువను, తాగునీటి బావిలోని పూడికను తొలగించామని జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫేస్ 1 ఫేస్ 2 నిధుల నుండి ఒక్కొక్క డివిజన్ కు రు.20 లక్షలు కేటాయించామని చెబుతున్న వైసీపీ నేతలు ఆ నిధులతో వైసిపి పాదయాత్రలో ప్రజలు వెలిబుచ్చిన సమస్యలు పరిష్కారం కాలేదని, మరి ఆ నిధులు ఏమయ్యాయి అని ప్రశ్నించారు.. శుక్రవారం పంట బోదె సమస్యను పరిష్కరించాలని జనసేన పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమానికి నగరపాలక సంస్థ అధికారులు, వైసిపి నేతలు ముందుగా చేరుకొని ప్రోక్లైన్ తో పంట కాలువను శుభ్రం చేసే పనులకు పూనుకున్నారు.. డివిజన్ పరిధిలో ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతం వంటకాలువ శుభ్రం చేయకపోవడంతో జనసేన పాదయాత్రలో తమ గోడు వెళ్ళబుచ్చుకున్నారని, సామాజిక వర్గం ఓట్లు దండుకున్న వైసిపి పార్టీ వారి సమస్యల పట్ల మొద్దు నిద్ర వహిస్తున్నారని, అప్పలనాయుడు ఆరోపించారు.. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, కుర్మా సరళ, 1 టౌన్ మహిళ ప్రెసిడెంట్ కోలా సుజాత, 2 టౌన్ మహిళ ప్రెసిడెంట్ జొన్నలగడ్డ సుజాత, మహిళ కార్యదర్శి తుమ్మపాల ఉమాదుర్గ, దుర్గా బీబీ, స్థానిక నాయకులు పల్లి విజయ్, దాసరి బాబి, భూపతి ప్రసాద్, లెహర్, మధు, కర్రా పవన్, సురేంద్ర, నాయకులు బెజవాడ నాగభూషణం, పసుపులేటి దినేష్, బోండా రాము నాయుడు, కోలా శివ, రాపర్తి సూర్యనారాయణ, జనసైనికులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.