ఎంఆర్‌పీఎస్, ఎంఎస్‌పి రిలే నిరాహార దీక్షకు జనసేన సంఘీబావం

  • అలుపెరుగని పోరాట యోధుడు ఎం.ఆర్‌.పీ‌.ఎస్ వ్వవస్దాపకులు మందక్రిష్ణ మాదిగ, ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు – జనసేన పార్టీ రాయలసీమ కో‌ కన్వీనర్‌ గంగారపు
  • రామదాస్ చౌదరితహసీల్దారు కార్యాలయం ఎదుట ఎంఆర్‌పీఎస్, ఎంఎస్‌పి రిలే నిరాహార దీక్షకు జనసేన పార్టీ సంఘీబావం
  • రెండవ రోజు దీక్షకు జనసేన పార్టీ రాయలసీమ కోకన్వీనర్ రాందాస్ చౌదరి, మరియు జనసేన నాయకులు, కార్యకర్తల సంఘీభావం

మదనపల్లి నియోజవర్గం: మహా జననేత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు షెడ్యూల్ కులాల ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కొరకై రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మదనపల్లి టౌన్ తహసీల్దార్ వారి కార్యాలయం ముందు ఎం.ఎస్.పి నియోజకవర్గ ఇంచార్జి ఆరేటి వాసు మాదిగ, ఎం.ఎస్.పి టౌన్ ఇంచార్జి వై రాజా మాదిగ, ఎం.ఆర్‌.పీ‌.ఎస్ నియోజకవర్గ ఇంచార్జి ఎస్ రెడ్డీశేఖర్ మాదిగ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రాందాస్ చౌదరి, వై రవీంద్ర రవి మాదిగ మాట్లాడుతూ ఈ దేశంలో ఎన్నో ఉద్యమలు వచ్చాయి కానీ ఎ ఉద్యమం నిలవలేకపోయినాయి. కానీ ధర్మాయుధం లాంటి ఎం.ఆర్‌.పీ‌.ఎస్ ఉద్యమమని గత 30 సంవత్సరాల నుండి అలుపెరగని పోరాటయోధుడిగా పయనిస్తున్న మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ. ఎందుకు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కమాట అన్నాడు అణగారిన నా జాతికి నాదేశానికి సంఘర్షణ వస్తే నేను నా జాతి పక్కన నిలబడతనని అన్నాడు. ఐతే ననుగన్న నా దేశానికి కష్టం వస్తే ప్రాణాలైనా అర్పిస్తాను అన్నాడు అలాంటి వారసుడుగా కృష్ణ మాది అలా ఉన్నారు. ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు సెప్టెంబర్ 18వ తేది నుండి 22వ తేది వరకు జరుగు సందర్భంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ మాదిగ, మాదిగ ఉపకలాలకు విద్యా ఉద్యోగ రంగాల్లో సంపూర్ణతమైన న్యాయం చేసే దిశగా ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కలిగించే దిశగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వలు మాదిగ, మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని వారు కోరుతున్నా ఏబీసీడీ వర్గీకరణ మాదిగ, మాదిగ ఉపకులాలకు న్యాయపద్దతేనని తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జంగాల శివరాం, గ్రానైట్ బాబు, జగదీష్, కుమార్, గడ్డం లక్ష్మీపతి, లక్ష్మినారాయణ, రెడ్డెమ్మ, జనర్దన్, అర్జున, మోహన కృష్ణ, నవాజ్, ప్రసాద్, ఎం.ఆర్‌.పీ‌.ఎస్ నాయకులు ఎంఎస్‌పి టౌన్ ఇంచార్జి వై రాజా, మరియు నాయకులు బండ్రేవు రమణ అన్న, క్రిష్, మండల ఎంఎస్‌పి ఇంచార్జి కొండప్ప సార్, లక్ష్మిపతి, గౌడశానిపల్లి శీను, చిలకవారిపల్లి రమణ, మంజునాథ్, అంజిబాబు, వి.హెచ్.పి.ఎస్ మండల అధ్యక్షులు విశ్వనాధ్, రమణ(మమ్మీ), నరసింహలు, ప్రశాంత్, సుధ, మేస్త్రి రమణ, వేణుగోపాల్, రెడ్డినారాయణ, నరసింహులు, వెంకీ, హరి, వేంపల్లి రవి,మరియు ఎం ఆర్ పి ఎస్, ఎం ఎస్ పి అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.