రాంలాల్ ప్రభూజీ బాబా జయంతి వేడుకలలో పాల్గొన్న శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, ఫరిజల్లిపేట గ్రామంలో రాంలాల్ ప్రభూజీ బాబా జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి విచ్చేసారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బత్తుల వెంకటలక్ష్మికి ఘన స్వాగతం పలికారు. అనంతరం బాబా గారిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించి అనంతరం ఏర్పాటు చేసిన భారీ అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమానికి వచ్చిన భక్తులకు స్వయంగా బత్తుల వెంకటలక్ష్మి అన్న వితరణ చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు నాతిపం దొరబాబు, నాతిపం భజన్నారాయణ, నాతిపం పద్మారావు, మన్యం వీరవెంకట రావు, నాతిపం రాజు, యాడవిల్లి పాపారావు, పంతం మణికంఠ, నాతిపం సుబ్బారావు, నాతిపం మణితేజ, నాతిపం రాజు, కామిశెట్టి చిన్నోడు, గల్లా గంగారావు, కామిశెట్టి సాయి, తోట అనిల్ వాసు, పరం రామకృష్ణ, పనసపాటి ప్రసాద్, యర్రంశెట్టి పొలారావు, చిట్టిప్రోలు సత్తిబాబు, మండవరపు చంటి, వీరామహిళ గండి జయ, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.