శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా 15000 రూపాయల విరాళమిచ్చిన శ్రీమతి దోవారి పవిత్ర

కృష్ణా జిల్లా, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆదివారం పమిడిముక్కల మండలం కృష్ణాపురం గ్రామం ముసల నాయకునిపాలెంలో శ్రీ కోదండ రామాలయన్ని శ్రీమతి దోవారి పవిత్ర దర్శించుకున్నారు, కళ్యాణ మహోత్సవం సందర్భంగా 15000 రూపాయలు చందాగా ఊరి గ్రామస్తులకు అందచేశారు. అదే విధంగా గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యలక్ష్మి అంబటి, కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి మరియు జనసైనికులు పాల్గొన్నారు.