అయ్యప్ప స్వాముల భిక్ష కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి మాకినీడి శేషుకుమారి

పిఠాపురం మండలం జల్లూరు గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష ధరించిన స్వాముల అన్నదాన బిక్ష కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు బుర్రా బాబ్జి స్వామి ఆధ్వర్యంలో బుర్రా సూర్య ప్రకాష్ ఆహ్వానం మేరకు పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. గురుస్వామి ఆశీస్సులు తీసుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో తులతూగాలని అయ్యప్ప స్వామి ఆశీస్సులు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, గురు స్వామి పినగాడి సత్యనారాయణ, బుర్రా బాబ్జి, విశ్వనాధుల వరబాబు, విశ్వనాధుల సుబ్రహ్మణ్యం, గరగ బాబ్జి, బత్తిన విష్ణుమూర్తి, బత్తిన చక్రపాణి, బుర్రా శ్రీనివాస్, విశ్వనాధుల అప్పలరాజు, పాలిక రాజు, బండి హరీష్, బుర్రా శివదత్త కుమార్, తోట రమేష్, మణుగుల చిన్న, అల్లారుపు నవీన్, తాటికాయలు బుజ్జి, నామ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.