రసూల్ నగర్ గ్రామంలో పర్యటించిన శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి

చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలం, రసూల్ నగర్ గ్రామంలో మండల ఉపాధ్యక్షులు గంగా ఓం ప్రకాష్ మరియు మండల కార్యదర్శి ఢిల్లీ సుల్తాన్ ఆహ్వానం మేరకు శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి రసూల్ నగర్ గ్రామాన్ని పర్యటించారు. ఈ కార్యక్రమంలో రమాదేవి మాట్లాడుతూ నిజమైన సామాజిక న్యాయం ఒక్క జనసేన పార్టీ వల్లే సాధ్యమని, పవన్ కళ్యాణ్ ని సీఎం చేయడం ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. జనసైనికులు అందరూ ప్రజలందరితొ ఐక్యమత్యంగా కలసి వారికి పవన్ కళ్యాణ్ ఆశయాలను జనసేన పార్టీ సిధ్ధాంతాలను అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేసి పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలని ప్రతి ఒక్క జనసేన నాయకులను, జనసైనికులను కోరుకుంటున్నాను అన్నారు. దీనిపై త్వరలో మండల స్థాయిలో వర్క్ షాప్ నిర్వహిస్తామని ఈ సందర్భంగా శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీరమహిళ పుష్ప, ఉపాధ్యక్షులు గంగా ఓం ప్రకాష్, కార్యదర్శి ఢిల్లీ సుల్తాన్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.