తక్షణమే రోడ్డు నిర్మించాలని కోటవురట్ల జనసేన డిమాండ్

అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట నియోజకవర్గం, కోటవురట్ల మండలం గొట్టివాడ శివారి అణుకు గ్రామంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనవాణి కార్యక్రమంలో భాగంగా బుధవారం అణుకు గ్రామానికి వెళ్లడం జరిగింది. అణుకు గ్రామం 5 కిలోమీటర్ల దూరం పెద్ద పెద్ద రాళ్లు, గుంతలు, తుప్పలు కనీస దారి లేని ఊరు. వైయస్సార్ పార్టీ అధికారంలో ఉన్న ఇప్పటివరకు ఈ గ్రామాలు ఉన్నట్టు గుర్తించడంగాని, వారికి రోడ్డు సదుపాయం గాని, గర్భిణీ స్త్రీలు తీసుకెళ్లడనికి ఎటువంటి సదుపాయాలు గాని ఏర్పాటు చేయలేదు. మారుమూల గ్రామంగా దీనిని వదిలేసారు. అయితే ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ కోటవురట్ల మండల నాయకులు బాలేపల్లి ఏసుబాబు, ఉగ్గిన రాము ఈ సమస్యను జనసేన పార్టీ ద్వారా వెలుగులోకి తేవడం జరిగింది. ఇలా ఇబ్బందులు పడుతూ ఎంతోమంది గర్భిణీ స్త్రీలు కూడా మరణించడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించాలని అలాగే స్కూలు పిల్లలు వర్షాకాలం వస్తే కనీసం నడిచి వెళ్లే దారి లేకుండా ఇక్కడ పరిస్థితి ఉంది. ఒకవేళ చదువుకోవాలని వెళ్తే వర్షాకాలంలో ఆ వరదలకు కాలవల్లో పడి పిల్లలు కొట్టి పోతారని భయంతో వాళ్ళ తల్లిదండ్రులు స్కూలు కూడా పంపించ లేకపోతున్నారు. ఇటువంటి మెట్ల రోడ్డు వల్ల ఇటు 5 కిలోమీటర్లు అటు 5 కిలోమీటర్లు స్కూలు పిల్లలు నడవడం అత్యంత దుర్మార్గమైన పరిస్థితి ఉంది అంటే అది ఒక నియోజకవర్గంలోనే ఇటువంటి పరిస్థితిలో జనసేన పార్టీ ద్వారా ఎన్నోసార్లు ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించాలని ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబురావు స్పందించి గొట్టివాడ పంచాయతీ, శివారి గ్రామం అణుకు తక్షణమే రోడ్డు ఏర్పాటు చేయాలని బాలేపల్లి ఏసుబాబు, ఉగ్గిన రాము డిమాండ్ చేయడం జరిగింది. ఈ సమస్యను ఈనెల 16వ తేదీన పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసినటువంటి జనవాణి కార్యక్రమంలో వినతిపత్రం ఇచ్చి వీటి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తామని కోటవురట్ల మండల నాయకులు ఉగ్గిన రాము, బాలేపల్లి ఏసుబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలేపల్లి ఏసుబాబు, ఉగ్గిన రాము, భీమరాజు గోవిందు స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.