అంగన్వాడీ ఉద్యోగుల దీక్షకు సంఘీభావం తెలిపిన శ్రీమతి వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గం: గత 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు న్యాయ బద్దంగా కోరుతున్నా డిమాండ్ లు పరిష్కరించాలని చేస్తున్న దీక్షలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న పోరాటానికి శుక్రవారం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా పార్టీ తరఫున సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాదయాత్రలో నా అక్క చెల్లెమ్మలు అని ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది నిరసన చేస్తుంటే పట్టించుకోకుండా జగన్ ఉండడం బాధాకరం అన్నారు. కనీస వేతనం 26 వేలు చెల్లించాలన్న డిమాండ్, గ్రాట్యుటీ, పెన్షన్ డిమాండ్ లు అమలు చెయ్యాలని కోరారు. సుప్రీం కోర్టు ఆదేశాలు సైతం అమలు చెయ్యకపోవడం బాధాకరం అన్నారు. 3 నెలలు దాటాక జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో అంగన్వాడీ డిమాండ్ లు తప్పక పరిష్కరిస్తామని మాట ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ పనులను సచివాలయం ఉద్యోగుల చేత చేయించడం సిగ్గు చేటు అని, రేపు మునిసిపాలిటీ వర్కర్లు నిరసన చేస్తే సచివాలయ ఉద్యోగుల దగ్గర డ్రైనేజ్ కాలువలు కడిగిస్తారా అని ఎద్దేవా చేశారు. అంగన్వాడీ కార్యకర్తలకు పూర్తి మద్దతు జనసేన నుండి ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, పట్టణ ఉపాధ్యక్షులు తోట గణేష్, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, ప్రధాన కార్యదర్శి రవి కుమార్ రెడ్డి, పేట చిరంజీవి, పేట చంద్ర శేఖర్, నితీష్ కుమార్, చిట్టేటి వినోద్, ముడుసు గణేష్ నాయకులు లక్ష్మి, కవిత, రాజ్య లక్ష్మి, రాజేష్, సురేష్, గురవయ్య, జనసైనికులు దినేష్, హేమంత్, మహేష్, వెంకటరమణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.