చేనేత కళాకారులకు ప్రవాస భారతీయ మహిళల సంఘీభావం

లండన్, చేనేత దినోత్సవం సందర్భంగా ప్రవాస భారతీయ మహిళలు లండన్ నగరంలో దీప్తి జైన్ ఆధ్వర్యంలో “బ్రిటిష్ విమెన్ ఇన్ శారీ” ఈవెంట్ జరుపు కోవడం జరిగింది. సుమారు ఆరు వందలు మంది మహిళలు భారతదేశ చేనేత చీరలు ధరించి చేనేత కళాకారులకు సంఘీభావం ప్రకటించారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తయారు చేసే వివిధ చేనేత చీరలు ధరించి సాంస్కృతిక కార్యక్రమాలతో లండన్ వీధులలో అంగ రంగ వైభవంగా ప్రవాస భారతీయ మహిళల శారీ వాకతాన్ జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తయారయ్యే ఉప్పాడ, మంగళగిరి, కళంకారీ, వేంకటగిరి మరియు ధర్మవరం చేనేత చీరలు ధరించి సంఘీభావం ప్రకటించారు.