జగనన్న కాలనీలను సందర్శించిన శ్రీమతి వినుత

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలలో ఇళ్ళ నిర్మాణం పురోగతిని డిజిటల్ కాంపైన్ ద్వారా ప్రజలకి తెలిపే కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా నాయకులు, కార్యకర్తలతో కలిసి నియోజకవర్గంలోని 4 మండలాలలో మంజూరు చేసిన జగనన్న కాలనీ లలోని ఇళ్లను పరిశీలించడం జరిగింది. అక్కడి ఇళ్ళ నిర్మాణాన్ని జియో టాగింగ్ ద్వారా చిత్రీకరించడం జరిగింది. సోషియల్ మీడియా వేదికగా #Fఐలురెఓఫ్ఝగనన్నఛొలొన్య్ పేరుతో ఫోటోలు వీడియోలను ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తెచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ చేసింది. శ్రీకాళహస్తి పట్టణం, రాజీవ్ నగర్ లో మంజూరు చేసిన దాదాపు 2,000 ఇళ్లకు కేవలం 10 ఇళ్లు కూడా పూర్తి కాలేదు. ఏర్పేడు మండలం, చిందేపల్లి గ్రామం వద్ద మంజూరు చేసిన దాదాపు 8,000 ఇళ్ళకి 1 ఒక్కటంటే ఒక్క ఇళ్లు కూడా పూర్తి కాలేదు. శ్రీకాళహస్తి మండలం, ఊరందూరు-ముచ్చుఓలు వద్ద సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి శంఖుస్థాపన చేసి మంజూరు చేసిన దాదాపు 13,000 ఇళ్ళకి 100 ఇళ్లు కూడా పూర్తి కాలేదు. రేణిగుంట మండలం, కుర్రకాల్వ దగ్గర మంజూరు చేసిన దాదాపు 1500 ఇళ్ళ కి 10 ఇళ్లు కూడా పూర్తి కాలేదు. ఈ కాలనీల్లో ఇళ్ళ నిర్మాణానికి ప్రాథమిక అవసరాలు అయిన రోడ్లు, డ్రైనేజ్ కాలువలు, నీళ్ళు, విద్యుత్ సరఫరా సౌకర్యాలు అస్సలు కల్పించలేదు కనీస సౌకర్యాలు లేకుంటే ప్రజలు ఎలా ఇళ్లు నిర్మించుకుంటారు, ఏదోలా నిర్మించుకున్నా ఎలా కాపురం ఉండగలరు అని వినుత ద్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పల గోపి, రేణిగుంట మండల ఉపాధ్యక్షుడు బాలాజీ, నాయకులు వేణు గోపాల్, తోటా గణేష్, భాగ్యలక్ష్మి, తులసిరామ్ జనసైనికులు ఉదయ్, దినేష్, గోపి, గాంధీ తదితరులు పాల్గొన్నారు.