మట్టి పోశారు తారు మరిచారు: యుగంధర్

గంగాధర నెల్లూరు నియోజకర్గం: జనసేన, తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా రోడ్ల దుస్థితిపై నిరసన కార్యక్రమం పాలసముద్రం, గంగాధర్ నెల్లూరు మండలంలో చేపట్టారు, ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో మట్టి పోశారు తారు తిన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలసముద్రం మండలంలో వెంగళరాజు కుప్పం బ్రిడ్జి కృంగిపోయిందని, దానిని మరమ్మత్తు చేయవలసిన ఆవశ్యకత ఉందని, వీలైతే కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని జనసేన తెలుగుదేశం తరఫున డిమాండ్ చేశారు. అలాగే అక్కడక్కడ గుంతలు, గొయ్యిలు ఏర్పడ్డాయని దీనిని కూడా పూడ్చాల్సిన అవసరం ఉందని, అవసరం ఉన్నచోట రోడ్లు వేయకపోవడం, అనవసరమైన చోట రోడ్డు వేయడం ఉపముఖ్యమంత్రి కి ఆనవాయితీగా మారిందని ఎద్దేవా చేశారు. గంగాధర్ నెల్లూరు మండల కేంద్రం నుండి తూగుండ్రం వరకు చిత్రమైన రోడ్ల పరిస్థితిని నుండి ప్రయాణికులకు, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా మరమత్తులు చేయాలని డిమాండ్ చేశారు. 2024 జనసేన తెలుగుదేశం సరికొత్త ప్రజా ప్రభుత్వంలో సర్వహంగులతో నియోజకవర్గంలో సర్వరంగ సమగ్ర అభివృద్ధి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు సురేష్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు స్వామిదాస్, చిత్తూరు పార్లమెంటరీ కమిటీ ఉపాధ్యక్షులు వెంకటేష్,పాలసముద్రం మండల అధ్యక్షులు సతీష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, నాయకులు మండల బీసీ సెల్ అధ్యక్షులు జ్యోతి యాదవ్, పార్లమెంట్ వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి కోదండ రెడ్డి, మండల టిఎన్పివిసి అధ్యక్షులు చంద్రబాబు గౌడ్, పార్లమెంట్ క్రిస్టియన్స్ సెల్ కార్యదర్శి రాజేంద్రన్, పార్లమెంటరీ క్రిస్టియన్ సెల్ ఉపాధ్యక్షులు జాన్, నాయకులు దామోదర్, మునుస్వామి, మాజీ సర్పంచ్ జాన్, వడివేలు, మైకేల్, నరసింహనాయుడు, చిత్తూరు పార్లమెంటు రైతు విభాగం అధికార ప్రతినిధి గోపాల్ రెడ్డి, జగన్నాథ రెడ్డి, పథ కుమార్, ఉలగనాథన్, ప్రకాష్, దేవరాజ్, హేమంత్, ఆపూరు, రాజ, సంపత్, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు రషీద్, జనసేన పార్టీ మండల బూత్ కన్వీనర్ తులసి కుమార్, జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి దాము, ప్రధాన కార్యదర్శి పోతన్ కుమార్ రెడ్డి, కార్వేటి నగర్ మండల కార్యదర్శి నవీన్, జనసైనికులు, ఉపాధ్యక్షులు రాఘవ, మండల యువజన అధ్యక్షుడు తులసి కుమార్, జనసైనికులు, మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శేఖర్ రాజు, అరుణ్ నాదం, విజయ్ కుమార్, అవినాష్, కార్తీక్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.