జనసేన ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

అనకాపల్లి నియోజకవర్గం, కశింకోట మండలం, పేరంటాలపాలెం గ్రామంలో శివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా మంగా ఈశ్వర్, కశింకోట మండల నాయకులు, జనసైనికులు విచ్చేసి, గ్రామ శివాలయంలో మహాశివుడి దర్శనం అనంతరం గ్రామ మహిళలు వేసిన ముగ్గులు పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. అనంతరం పోటీలో పాల్గొన్న అందరికి పార్టిసిపేషన్ బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఉత్తాడ రామరాజు, కలగ శ్రీనివాసరావు, గొంతిన ఈశ్వరరావు, కరణం రమణ, గూడెపు మణికంఠ, కడిమి నాగ చిరంజీవి, అఖిల్ శ్రీను, కలగ గణేష్ మరియు గ్రామ జనసేన నాయకులు మండపాక రామ త్రినాధ్, మండపాక తలుపుల రాజు, సత్తిబాబు, అప్పలసత్తి, నందరపు గణేష్, అరిగా గణేష్, రాముడు, కోన సత్తిబాబు, పూర్ణ, నానాజీ, తాతాజీ తదితర జనసైనికులు పాల్గొన్నారు.