ఇసుకపల్లి జనసేన ఆధ్వర్యంలో ముగ్గులు, కోకో మరియు కబడ్డీ పోటీలు

నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, మర్రిపాడు మండలం జనసేన పార్టీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు డబ్బు కొట్టు నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో ఇసుకపల్లి గ్రామంలో ముగ్గుల పోటీలు, కోకో మరియు కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గెలిచినవారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు పెంచలయ్య, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్ యాదవ్, అధికార ప్రతినిధి రమేష్, మండల కోశాధికారి గంగ యాదవ్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.