జనసేనానికి జెడ్ ప్లస్ కేటగిరిని కల్పించాలని ములకలపల్లి జనసేన డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలంలో ఉన్న మండల అధ్యక్షులు మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి మరియు యువజన విభాగం నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ జనసేన అధినేత పైన దాడికి కుట్ర పన్నడం తీవ్రంగా ఖండిస్తున్నాం. మా జనసేన అధినేతకు చిన్న గీత పడ్డా ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతుంది అని అంతేకాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు అందరూ ఒకటై దాడికి ఎవరైతే యత్నించారో వారికి తగిన బుద్ధి చెప్పడమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో నాలుగవ ప్రపంచ యుద్ధం మొదలవుతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఒక సాంప్రదాయ బద్ధమైన న్యాయబద్ధమైన ఒక విధానపరమైన రాజకీయ విధానంతో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దోపిడి దారి వ్యవస్థను రూపుమాపే ఉద్దేశంతో జనసేన పార్టీ ఎంతో నియమ నిబద్ధతతో పనిచేస్తుంటే చేతకాని రాజకీయ నాయకులు మంత్రులు మా జనసేన అధినేతను రాజకీయపరంగా ఎదుర్కోలేక ఇటువంటి దాడులకు కుట్ర పన్నుతున్నారు ఇటువంటివి విరమించుకోకపోతే ఒక తెలంగాణనుంచే కాదు ప్రపంచంలో ఉన్న జనసేన కార్యకర్తలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమవుతుందని జనసేన అధినేతకు భద్రత కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని అదేవిధంగా తెలంగాణ మరియు కేంద్ర ప్రభుత్వాలు కల్పించుకుని మా అధినేతకు జెడ్ ప్లస్ కేటగిరిని కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం సమావేశంలో మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్ విద్యార్థి మరియు యువజన విభాగం నాయకులు గొల్ల వీరభద్రం, గరిక రాంబాబు, మండల ఉపాధ్యక్షులు పొడిచేటి చెన్నారావు, ప్రధాన కార్యదర్శి వుకే నాగరాజు మరియు జనసేన నాయకులు, మరియు జనసేన కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.