ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మగా నామకరణం చేయాలని

ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మగా నామకరణం చేయాలని అంబేద్కర్ విగ్రహం ముందు బ్లాక్ బ్యాడ్జీలతో ఉమ్మడి వరంగల్ జిల్లా జనసేన పార్టీ ఇన్చార్జ్ ఆకుల సుమన్ ఆదేశాల మేరకు నిరసన తెలియజేసిన కార్యక్రమంలో ములుగు జిల్లా నాయకులు కొలిపాక ప్రశాంత్ ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం చేయాలని డిమాండ్ చేయటం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చిన హామీని 18వ తేదీన సమ్మక్క సారక్క సన్నిధిలోని ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం చేయవలసిన అవసరం ఉందని, కేసీఆర్ ఇచ్చిన హామివెంటనే అమలు పరచాలని తెలంగాణ రాష్ట్రం కూడా సమ్మక సారక్క దయవలన ఏర్పడిందని కేసీఆర్ ఎందుకు అణచి వేస్తున్నారని, గత జాతరలో 250 కోట్లతో అభివృద్ధి అన్నమాట పేపర్ వరకే పరిమితం అయ్యింది. కేసీఆర్ మాట వాగ్దానాల వరకే పరిమితం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదనీ, 18వ తేదీన తప్పకుండా సమ్మక్క సారలమ్మ జాతర సన్నిధిలో ములుగు జిల్లాకు వనదేవతల పేర్లు పెట్టాల్సిందేనని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్ ముంజాల బిక్షపతి, ఎమ్మార్పీఎస్ నాయకులు నేమలి నర్సయ్య, శ్రీనివాస్, శంకర్, రాజు, జనసైనికులు తరుణ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.