యూఏఈ లో గల్ఫ్ జనసేన ఔదార్యం..

*ఏజెంట్స్ మాయలో పడి దుబాయ్ లో చిక్కుకున్న పదిహేను మందిని కాపాడిన వైనం !!


తూర్పుగోదావరి జిల్లా, రావులపాలెం తదితర ప్రాంతానికి చెందిన పదిహేను మంది యువకులు ఉద్యోగ మాయలో పడి దుబాయ్ లో వసతి లేక, ఆహారం లేక బిక్కుమన్నారు. .. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా, ఇరగవరం మండల, అర్జునుడు పాలేం చెందిన వ్యక్తి దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. నిరుద్యోగుల ఉన్నారని తెలిసి వారికి మంచి ఉద్యోగం ఉంది అని ఒక్కక్కరిదగ్గర దాదాపు లక్ష ఏభైవేల రూపాయిలు
(దాదాపు ఇరవై ఐదు లక్షలు రూపాయలు) వసులు చేసాడు ! వారందరికీ దుబాయ్ రావడానికి విసిట్ విసా తీసాడు. నిరుద్యోగులు అందరు కోటి ఆశలతో విమానాలు ఎక్కి దుబాయ్ లో దిగారు, ఇక్కడకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి కొన్ని రోజులు వెయిట్ చేయండి అని నిరుద్యోగులను సముదాయించాడు, నెల రోజలు అయినా ఉద్యోగ సమాచారం లేదు డౌట్ వచ్చి నిరుద్యోగులు ఆ వ్యక్తిని నిలదీయడం తో అస్సలు రంగు బైటపడింది .. నాకు ఏమి సంబంధం లేదు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని యువకులను తిట్టి మొబైల్ ఆఫ్ చేసుకున్నాడు, యువకులకు ఏమి చేయాలో తెలియక తెలుగు వ్యక్తులద్వారా యూఏఈ లోని గల్ఫ్ సేన జన సేన ప్రతి నిధులకు సమాచారం అందించారు.. సమాచారం అందుకున్న జనసైనికులు హుటాహుటిన రాత్రి పది గంటల ప్రాంతం లో నిరాశ్రయుల దగ్గరకి వెళ్లి కలిస్తే వారి పరిస్తితి వసతి లేక రోడ్ మీద ఉండి , ఆహారం లేక దీనస్థితిలో చూసిన తెలుగు వారు చెలించి పోయారు. రాత్రి పన్నెండు గంటలకి దుబాయ్ పోలీస్ వారికి సమాచారం అందించారు వారు వచ్చి వివరాలు సేకరించుకున్నారు. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో నిరాశ్రయులకు భోజనం, వసతి ఏర్పాట్లు చేశారు.. బాధితులు అందరు ఏజెంట్ కి పంపిన బ్యాంకు రసీదులు అన్ని తమదగ్గర ఉన్నాయ్ అని అతన్ని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించి తమని కాపాడాలని అధికారులను, మాలాగ మరెవరు మోసపోకూడదు అని వాపోయారు..

ఛాలెంజ్ గా తీసుకున్న గల్ఫ్ సేన జన సేన ప్రతినిధులు

దేశం కానీ దేశం లో ఇబ్బందులు పడుతున్న వ్యక్తులను చలించిన జనసైనికులు వెంటనే సమాచారాన్ని స్థానిక పోలీసులకు సమాచారంతో పాటు భారతీయ కౌన్సిల్ అధికారులకు తెలియచేశారు.. దేశం కాని దేశంలో భాదిత 15 మందికి 45 రోజులు, ఆశ్రమం, భోజన కలిపించి.. వారందరినీ స్వదేశానికి క్షేమంగా పంపించారు. అంతటితో ఆగక.. ఇండియన్ కౌన్సి లేట్, ఏ.పి.ఎన్.ఆర్.టి, ఆంధ్ర ప్రదేశ్ సిఐడి, గ్రామ పెద్దల సహకారంతో నష్టపోయిన పదిహేనుమందిని మోసం చేసిన ఏజెంట్ నుండి రావాల్సిన మొత్తాన్ని మోసపోయిన బాధితులకు ఇప్పించగలిగారు.. బాధితులకి కొంతమందికి దుబాయ్ లోని ఉద్యోగ అవకాశాన్ని ఇప్పించారు.. ఇంతమందికి నిస్వార్థముగా సేవచేసిన గల్ఫ్ సేన జనసేన ప్రతి నిధులకు గల్ఫ్ లోని తెలుగు ప్రజలు బ్రహ్మరథం పట్టి అభినందించారు..

ఇలాగే మరెన్నో సేవా కార్యక్రమాలతో గల్ఫ్ సేన జనసేన ముందుకు వెళ్ళాలి అని సూచించారు.. ఇదంతా జనసేన అధినేత సొసైటీ మీద ఉన్న సేవా దృక్పదం మరియు ఆయన భావ జాలం మీద అభిమానంతో చేయగల్గుతున్నాము అని గల్ఫ్ సేన జనసేన ప్రతి నిధులు తెలియచేసారు.