కెకెఆర్ పై ముంబయి ఇండియన్స్ గెలుపు..

ఈ సీజన్‌లో ముంబయి  సేన బోణీ కొట్టింది.  చిదంబరం స్టేడియంలో నిన్న జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. కోల్ కతా నైట్ రైడర్స్ పై పది పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 152 పరుగుల లక్ష్యాన్ని కెకెఆర్ ముందు ఉంచింది. కోల్ కతా నైట్ రైడర్స్ ఓపెనర్లు శుభ్ మన్ గిల్(33), రానా(57) తొలి వికెట్ పై 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రాహుల్ చాహర్ బౌలింగ్ దాటికి కెకెఆర్ ఆటగాళ్లు పేక మేడలా కూలిపోయారు. మిగిలిన బ్యాట్స్ మెన్ల సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. దీంతో కెకెఆర్ 20 ఓవర్లలో 142 పరుగులు మాత్రమే చేసింది. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో రాహుల్ చాహర్ నాలుగు వికెట్లు పడగొట్టగా ట్రెంట్ బౌల్ట్ రెండు, కృనాల్ పాండ్యా ఒక వికెట్ తీశాడు. రాహుల్ చాహర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.