డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించిన ముమ్మిడివరం జనసేన పార్టీ

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం: ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ అధ్యక్షతన సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో గళమెత్తేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు 3రోజులు పాటు డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పితాని బాలకృష్ణ తెలిపారు.

సోమవారం జరిగే పార్లమెంట్ సమావేశాల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపుదల చెయ్యాలని కోరుతూ అమలాపురం పార్లమెంట్ ఎంపీ చింతా అనురాధ పార్లమెంట్ మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సానబోయిన మల్లికార్జునరావు, గోదశి పుండరీష్, జక్కంశెట్టి పండు, కడలి కొండ, గోలకోటి వెంకన్నబాబు, దూడల స్వామి, నూకల దుర్గ, మాదాల శ్రీధర్, పెమ్మాడి గంగాద్రి, రంబాల రమేష్, గిడ్డి రత్నశ్రీ, ముత్యాల జయలక్ష్మి, యలమంచిలి బాలరాజు, బల్ల కుమార్, సలాది రాజా, అత్తిలి బాబురావు తదితరులు పాల్గొన్నారు.