మురళీమోహన్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

పూతలపట్టు, ఐరాల మండలం పూతలపట్టు నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ఏపీ శివయ్య మాట్లాడుతూ పూతలపట్టు ఉమ్మడి అభ్యర్థి మురళీమోహన్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు మోడీ పవన్ కళ్యాణ్ కి, మురళీమోహన్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించి బహుమతిగా ఇద్దామని తెలిపారు. మురళీమోహన్ మీడియాలో చేసిన సేవలను గుర్తించి చంద్రబాబు నాయుడు పూతలపట్టు నియోజకవర్గం టికెట్టు ఇచ్చినట్లు తెలియజేశారు. ఈ నియోజకవర్గంలో వ్యవసాయాదారిత పరిశ్రమలని నిర్మించి రైతులు మనుషులు గెలుచుకోవాలని చిత్తూరు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ఏపీ శివయ్య కోరారు.