జనసేనలో ముస్లింలకు సముచిత స్థానం ఉంటుంది: స్రవంతి రెడ్డి

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం, కార్వేటి నగరం గ్రామపంచాయతీ, ముస్లిం కాలనీలో జనం కోసం జనసేన భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన నియోజకవర్గం ఇంచార్జి డా.యుగంధర్ పొన్న సతీమణి స్రవంతి రెడ్డి హాజరయ్యారు. ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా స్రవంతి రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పద్మ సరస్సు లేఔట్ లో ముస్లిం సోదరులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయకపోగా, అది కరోనా సమయమైనప్పటికీ వారికోసం ఒకరోజు నిరసన దీక్ష చేయగా, అధికారులు వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగింది. అదే రోజు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని జనసేన ఆఫీసు ముందు చేసిన నిరసన దీక్షకు జనసేన ఇన్చార్జి యుగంధర్ పొన్న మరియు నాయకుల మీద కేసు నమోదు చేశారు. ఈ ఈ విధంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో వేలాది కార్యక్రమాలు నియోజకవర్గంలో ఉన్న ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాటాలు ధర్నాలు నిరసనలు నిరాహార దీక్షలు ఆమరణ నిరాహార దీక్షలు చేసారు. అందుకే ఒకసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వండి అని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. జనసేన, తెలుగుదేశం అధికారంలోకి రాగానే కార్వేటి నగరంలో ఉన్న ముస్లిం సోదరులకు ఏదిగా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. జనసేన పార్టీలో ఈ రాష్ట్రంలో ముస్లింలకు సమచితమైన స్థానం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్వేటి నగరం టౌన్ ప్రెసిడెంట్ రాజేష్, కార్వేటి నగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, మండల బూత్ కన్వినర్ మండి సురేష్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు సెల్వి, టౌన్ ఉపాధ్యక్షులు చిరంజీవి, చంద్ర, ప్రధాన కార్యదర్శి మహేంద్ర, మీన, కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి రుద్ర, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, వెదురు కుప్పం మండల ఉపాధ్యక్షులు మునిరత్నం శెట్టి, ప్రధాన కార్యదర్శి బెనర్జీ, కాపు యువసేన మండల అధ్యక్షులు మాదాసి వెంకటేష్, జనసైనికుడు సునీల్, సీనియర్ నాయకులు రూపేష్, వీరమహిళ మంజుల పాల్గొన్నారు.