యువతకు ఆదర్శప్రాయుడు అంబేద్కర్

అల్లూరి జిల్లా, పాడేరు, కులపాడు గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో జరిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి ఉత్సవాలు. జనసేన పార్టీ జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న సారధ్యంలో జనసైనికులు, గ్రామస్తులు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మసాడి భీమన్న ప్రసంగిస్తూ బడుగు, బలహీనులకు ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత, ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రసాదించిన ఈ స్వేచ్ఛ జీవితం అనుభవిస్తున్నందుకు మనం ఎప్పటికి ఆయనకు ౠణపడి ఉంటాం. యువతకు ఆదర్శప్రాయుడు ఆ మహనీయుడు. ఆయన రాజ్యాంగ నిర్మాతయే కాదు గొప్ప ఆర్థిక నిపుణుడు కూడా బహుముఖ ప్రజ్ఞశీలి. అంటూ ఆయన చేసిన సేవలను ప్రస్తుత యువతకు తెలియ జేశారు. ఈ జయంతి ఉత్సవాల్లో కుడుముల సత్యనారాయణ, వైస్ ఎంపీపీ గసడ ధర్మారావు, కుడుముల లక్ష్మినారాయణ, ఉడ్రంగి రాఘవరావు, ఉడ్రంగి లక్ష్మి వార్డ్ మెంబర్. అధికసంఖ్యలో యువత, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.