ముత్యాలంపాడు వంతెన తక్షణమే మరమ్మతులు చేయాలి: మైలవరం జనసేన

మైలవరం నియోజకవర్గం, జి కొండూరు మండలం, ముత్యాలంపాడులో ఉన్నటువంటి వంతెన శిధిలావస్థకు చేరుకోవడం వలన ప్రజలకి వాహన రాక పోకలకి ఇబ్బంది కలుగుతుంది. దీని వలన అందరూ ఇబ్బందికి గురి అవుతున్నారు. అందువలన వంతెన నిర్మాణాన్ని వెంటనే తక్షణ మరమ్మతులు చేయాలని జనసేన పార్టీ తరుపున తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల రామమోహనరావు (గాంధీ), జి. కొండూరు మండల పార్టీ ప్రెసిడెంట్ వై.ఎల్.నరసింహారావు, జనసేన నాయకులు ప్రవీణ్, నాగరాజు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.