మా ప్రాంతం మన సచివాలయం కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్

కాకినాడ సిటీ: ఓపికపడితే వచ్చేది జనసేన ప్రభుత్వమేనని పవన్ ప్రభుత్వంలో కాకినాడ సిటీలో వున్న పేద ప్రజలకు స్ధానికంగానే ఇళ్ళు నిర్మాణం చేసి తాళాలు ఇస్తామని జనసేన పార్టీ పిఏసీ సభ్యులు, కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సినిమా రోడ్, బ్యాంక్ కాలనీ 34వ డివిజన్ లో మా ప్రాంతం మన సచివాలయం కార్యక్రమంలో భాగంగా డివిజన్ ఇన్ ఛార్జ్ పీతల ప్రవీణ ఏర్పాటు చేసిన కార్య్రమంలో ఆయన పాల్గొని వార్డు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమం లో ముందుగా సెంటర్లో ఉన్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అర్హ్వులైన పేదలకు ఇళ్ళుగాని, ఇంటి స్థలాలు లేవని ఆయనకు తెలిపారు. అలాగే విద్యుత్ బిల్లులు అధికంగా రావడం మూలంగా తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. కొంతమందికి ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాకు, లే అవుట్ కు సంబంధం లేదని స్థలం ఎక్కడఉందో తెలియని అయోమయంలో ఉన్నామని మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పేదలు ఎదుర్కొంటున్న ఇళ్ళ స్థలాల సమస్యపై ప్రజలకు తెలియజేయడానికి బాధితులను వెంట బెట్టుకుని ప్రభుత్వం ఇంటి నిర్మాణాలకు కేటాయించిన భూములను పరిశీలించేందుకు వెళ్లనున్నట్లు బాధితులకు ఆయన బరోసా ఇచ్చారు. ఈకార్యక్రమంలో సర్ల నాగేశ్వరరావు, శీల బాల నాగేంద్ర, వరిపల్లి రమేష్, శీల ఆనంద్ కుమార్, సప్పా సత్తిబాబు తదితులున్నారు.