పొన్నూరు టౌన్ లో మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన గాదె

75 వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు పొన్నూరు లో ఘనంగా ప్రారంభించారు.

పొన్నూరు జనసేన నాయకులు, జనసైనికులు ఘన స్వాగతం పలికారు
టౌన్ లో ఉన్న గాంధీ, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేశారు. పాత జనసేన పార్టీ ఆఫీస్ వద్ద జాతీయ జెండాను గాదె ఆవిష్కరించారు.

అనంతరం దేశ సరిహద్దుల్లో సేవలు అందించి పదవి విరమణ పొందినటువంటి 100 మంది ఆర్మీ జవాన్లకు షేక్ కరీముల్లా, షేక్ నూరి, ఎర్రసాని నాగభూషణం, శ్రీధర్, షేక్ గౌస్ మరియు (మైనార్టీ సోదరులు) ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది

స్వాతంత్ర్య వజ్రోత్సవాలను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని.. దేశ సరిహద్దులో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేశం కోసం పోరాడిన భరతమాత ముద్దుబిడ్డలైన సైనికులతో స్టేజి పంచుకోవడం చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు… ప్రతి ఒక్కరు స్వాతంత్ర్య స్పూర్తి కలిగివుండలన్నారు..

ఈ కార్యక్రమంలో ఈ జిల్లా కార్యవర్గ సభ్యులు నారదాస్ ప్రసాద్, తాళ్లూరి అప్పారావు, మేకల రామయ్య యాదవ్, దేశంశెట్టి సూర్య, పొన్నూరు రూరల్ మండల అధ్యక్షుడు నాగిశెట్టి సుబ్బారావు, చేబ్రోలు మండల అధ్యక్షుడు చందు శ్రీ రాములు, రంగా రధ మిత్రమండలి నాయకుడు యన్నం నాయుడు, టౌన్ జనసేన నాయకులు, మండల కార్యవర్గ సభ్యులు, గ్రామ అధ్యక్షులు, జన సైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *