కందరాడలో ‘నా సేన కోసం నా వంతు’

పిఠాపురం, జనసేన పార్టీ పిలుపుమేరకు జనసేన పార్టీ వ్యవస్థాపక నిర్మాణం కొరకు జనసైనికులను, వీర మహిళలను భాగస్వాములను చేస్టూ పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన నాయకులు వెన్నా జగదీష్ నిర్వహిస్తున్న డిజిటలైజేషన్ విరాళాల సేకరణ ప్రోగ్రాం ‘నా సేన కోసం నా వంతు’ అనే కార్యక్రమం సోమవారం 15వ గ్రామంగా కందరాడ చేరుకోవడం జరిగినది. కందరాడ గ్రామ జనసేన పార్టీ ఎంపీటీసీ పిల్లా సునీత ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ ప్రోగ్రాం జనసేన నియోజకవర్గం నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ సమక్షంలో జనసేన నాయకులు పిల్లా వెంకటదినేష్, పిల్లా శివ, మోటూరి మహేష్, వాకపల్లి సూర్య ప్రకాష్ లతో సంయుక్తంగా నిర్వహించడం జరిగినది. ప్రతి గ్రామంలోలాగే కందరాడ నందు రూపాయలు 1001/- ముందుగా తాను జనసేన పార్టీకి డొనేట్ చేసి స్థానిక జనసైనికులను జనసేన నాయకులను భాగస్వాములను చేసిన వెన్నా జగదీష్ స్థానిక యువతను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి రాష్ట్ర పరిస్థితులు చేరుకుంటున్న వైనాన్ని వివరించి, నా సేన కోసం నా వంతు ప్రోగ్రాంలో యువత భాగస్వామ్యులు అవ్వవలసిన అవసరాన్ని విశదీకరించారు. కులాలుగా మాతాలుగా వర్గాలుగా ప్రాంతాలుగా విభజించి పాలిస్తున్న నేటి పాలన స్థితిని ఇంతకంటే ఘోరంగా 4దశాబ్దాల క్రితం మన ఆంధ్రప్రదేశ్ కంటే 3 రెట్లు పెద్దదైన ఉత్తరప్రదేశ్లో నెలకొన్న స్థితిలు అప్పుడు కాన్షిరామ్ బహుజన సమాజ్ వాది పార్టీ నెలకొల్పి ఒక్క రూపాయి విరాళంగా ఏర్పాటు చేసి కఠోర శ్రమతో రాష్ట్రంలో చేసిన రాజకీయ సమతుల్యత కోసం చెప్పిన వెన్నా జగదీష్ అత్యుత్తమ మహాశయుల వారసుడైన పవన్ కళ్యాణ్ అభినవ కాన్షిరామ్ అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.