మారేపల్లి గ్రామంలో నా సేన కోసం నా వంతు

  • రాజకీయాల్లో క్రౌడ్ ఫండింగ్ రాజ్యమేలాలి
  • జన భాగస్వామ్యం పెరిగితేనే జవసత్వాలు
  • అదే రాజకీయ అవినీతికి విరుగుడు, ప్రక్షాళనకూ ఇదే నాంది
  • జనసేన ఇంచార్జి డా. యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు, వెదురుకుప్పం మండలం, మారేపల్లి గ్రామంలో జనసేన ఇంచార్జి డా. యుగంధర్ పొన్న పర్యటించారు. ఒక సిద్దాంతం కోసం భావజాలాన్ని నమ్మి ఒక సమూహం మొత్తం ముందుకు వెళ్తే అది పెను మార్పునకు నాంది పలుకుతుందని జనసేన ఇంచార్జి డా. యుగంధర్ పొన్న తెలిపారు. రాజకీయాల్లో ఇలాంటి గొప్ప లక్ష్యం సాధించడం కోసం ముందుకు వెళ్లే క్రమంలో క్రౌడ్ ఫండింగ్ అనేది అందరినీ కలిపి ఉంచే ఒక ఆర్థిక మంత్రం అని అన్నారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా పార్టీలో బలమైన భావజాలాన్ని, బాధ్యతనూ ప్రతి ఒక్కరూ పంచుకునే అవకాశం ఉంటుందని, పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తూ, జవసత్వాలను అందిస్తూ, సుదీర్ఘ ప్రయాణంలో తోడున్నామని చాటి చెప్పే ప్రక్రియ క్రౌడ్ ఫండింగ్ అని తెలియజేసారు. రాజకీయ పార్టీలో క్రౌడ్ ఫండింగ్ అంటే కేవలం కార్యకర్తలు, పార్టీకి సంబంధించిన వ్యక్తుల నుంచి విరాళాలను తీసుకోవడం కాదని, కార్పొరేట్ కంపెనీలు, సంస్థలు, పారిశ్రామికవేత్తలు, సామాజిక వర్గ పెద్దల నుంచి భారీ ఎత్తున విరాళాలు సేకరించడం అసలే కాదని, ఒక పార్టీ నమ్మిన సిద్ధాంతాన్ని తమ ఉమ్మడి సిద్ధాంతంగా సాధారణ ప్రజలు భావించి, ఆ పార్టీ మనుగడ కోసం వారు కూడా భాగస్వాములు కావడమే క్రౌడ్ ఫండింగ్ అని ఉద్ఘాటించారు. క్రౌడ్ ఫండింగ్ వల్ల రాజకీయ పార్టీ నిర్వహణ భారం తగ్గుతుందని, కచ్చితంగా సుదీర్ఘ ప్రయాణం కోసం వచ్చిన పార్టీకి ఇది ఎంతగానో ఉపయోగకరమని, ఒక సమూహం తాలూకా వ్యక్తిగత సొమ్ము పోగు చేయడం సులువైన పనని, దీంతో పాటు ఒక్కరి పైనే పడే ప్రత్యేకమైన ఆర్ధిక భారం కూడా తగ్గుతుందని, ఇది పార్టీలో క్రమశిక్షణకు కూడా ఉపయోగ పడుతుందని తెలియజేసారు. ఒక రాజకీయ పార్టీకి వచ్చే క్రౌడ్ ఫండింగ్ వల్ల ఆ పార్టీ బలం, భావజాలం ఎంతగా ప్రజల్లో ఉన్నాయో అర్ధం అవుతుందని, ఖర్చు చేసే ప్రతి రూపాయికి పారదర్శకమైన లెక్కలు చూపించడం వల్ల మరింత బలం చేకూరుతుందని తెలిపారు. మనకోసం పనిచేసే నాయకుడికి క్రౌడ్ ఫండింగ్ ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుందని, అధికారంలోకి వచ్చినప్పుడు సిద్ధాంతాన్ని బలంగా ఆచరణలో పెట్టడానికి కూడా క్రౌడ్ ఫండింగ్ అనేది చాలా అవసరమని తెలిపారు. జన విరాళాలు కచ్చితంగా అందర్నీ ఐక్యమత్యంగా ఉంచేవని, ఎవరి పరిధిలో వారు పార్టీ నిర్వహణ కోసం ఇచ్చే విరాళాలు ఒక రకమైన భావోద్వేగం తో ముడిపడి ఉంటాయని, కొత్త వ్యక్తులు సైతం పార్టీకి అసోసియేట్ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. కనీసం 10 రూపాయలు దగ్గర నుంచి విరాళాలు ఇచ్చే వెసులుబాటు కల్పించడం ద్వారా పేదలు, దిగువ మధ్యతరగతి వారు సైతం పార్టీకి ఆనందంతో తమకు తోచిన సహాయం చేస్తారని, దీని వల్ల పార్టీ మరింత ప్రజా బాహుళ్యంలోకి వెళ్తుందని తెలిపారు. క్రౌడ్ ఫండింగ్ విధానం వల్ల పార్టీని పూర్తిస్థాయిలో భుజాన వేసుకొని ముందుకు నడిపిస్తున్న వారికి ఆర్థిక భారం నుంచి కాస్త ఉపశమనం లభిస్తుందని అన్నారు. అప్పుడు కచ్చితంగా పూర్తి స్థాయిలో పార్టీ మీద అధినేతకు ఫోకస్ ఉంటుందని తెలిపారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలకు ఇది ఎంతో ఉపయోగమని . పార్టీ కార్యకలాపాల మీద పూర్తి స్థాయిలో అధ్యక్షులు దృష్టి నిలిపేందుకు ఇది పనికొస్తుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీ నిర్వహణ భారంగా మారిందని, ఏదైనా కార్యక్రమం జరిగే సమయంలో వేదిక ఏర్పాటు దగ్గర నుంచి కార్యక్రమం పూర్తయ్యే వరకు ఆర్థిక భారం అనుకున్న దానికంటే రెండు, మూడు రెట్లు పెరుగుతోంది. దీని వల్ల ఒక కార్యక్రమం తర్వాత మరో కార్యక్రమం కోసం ఆర్థిక వనరులు సమీకరించుకునే వరకు వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు. రాజకీయ పార్టీలకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా విరాళం ఇస్తే దానికి సంబంధించి ఆదాయపన్ను మినహాయింపు ఉంటుంది. అంటే ఇచ్చే విరాళాలకు సంబంధించి రిటర్న్స్ లో దీనిని చూపించుకోవచ్చు. ఇది మధ్య తరగతి వారికి ఎంతో ప్రయోజనం అని తెలిపారు. వెదురు కుప్పం మండలంలోని ప్రజలందరూ పవన్ కళ్యాణ్ సేవలకు తమ వంతుగా 7288040505, 7288040505@ఉపి జనసేన పార్టీ నెంబర్ కి ఫోన్ పే, గూగుల్ పే, పే టియం ద్వారా తోడ్పాటు నందించాలని ఈ సందర్బంగా కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పురుషోత్తం, జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్, ప్రధాన కార్యదర్శులు ముని, సతీష్, కార్వేటి నగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.