పొన్నూరులో ‘నా సేన కోసం నా వంతు’

పొన్నూరు, జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కార్యక్రమం శనివారం పొన్నూరు మండలం, కట్టెంపూడి గ్రామంలో గ్రామ అధ్యక్షుడు కొమ్మినేని నరేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహిళా వింగ్ కో ఆర్డినేటర్ శ్రీమతి బి పార్వతి నాయుడు మాట్లాడుతూ… భావితరాల కోసం బాధ్యతగా పోరాడే జనసేన పార్టీకి మనమందరం మద్దతుగా నిలవాలని, పార్టీని ఆర్ధికంగా బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్లూరి అప్పారావు, దేశంశెట్టి సూర్య, మండల అధ్యక్షుడు నాగిశెట్టి సుబ్బారావు, మండల కార్యవర్గ సభ్యులు, గ్రామ కార్యవర్గ సభ్యులు, గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.