పిఠాపురం జనసేన ఆధ్వర్యంలో ‘నా సేన కోసం నా వంతు’

పిఠాపురం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపుకు స్పందిస్తూ, పిఠాపురం నియోజకవర్గ నాయకులు వెన్నా జగదీష్ నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహిస్తున్న డిజిటలైజేషన్ విరాళాల సేకరణ కార్యక్రమం మంగళవారం రాయవరంలో నిర్వహించడం జరిగినది. అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాటి నుండి డిస్టలైజేషన్ విరాళాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వెన్నా జగదీష్ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రతి చోటా 1001 రూపాయి తాను ముందుగా డొనేట్ చేస్తూ సహసభ్యులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణం, తాడిపత్తి, విరవ, మంగితుర్తి, మల్లం, జల్లూరు, రాపర్తి, కుమరపురం, ఎఫ్.కె పాలెం గ్రామాల జనసైనికులను వీర మహిళలను భాగస్వామ్యులను చేశారు. రాజకీయాలలో మార్పు కోసం భావితరాల భవిష్యత్ కోసం ప్రయాణం చేస్తున్న జనసేన పార్టీకి బాసటగా నిలిచే ప్రయత్నంతో ‘మా జనసేన కోసం మా ఊరి వంతు’ అనే నినాదంతో ఇది మన బాధ్యత అనే భావన పెంపొందేల, పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జనసైనికులను, వీర మహిళలను జనసేన సానుభూతిపరులతో పాటు ఈ కార్యక్రమాలలో ఉభయగోదావరి జిల్లాల రీజనల్ మహిళా కోఆర్డినేటర్ చల్లా లక్ష్మి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల అధికార ప్రతినిధి తోలేటి శిరీష మరియు పలువురు జనసేన నియోజకవర్గ నాయకులను భాగస్వాములను చేస్తున్న వెన్నా జగదీష్ కృషికి ప్రతీ చోట విశేష స్వందన లభిస్తుందని తెలిపారు. గతంలో కూడా పార్టీ పిలుపు ఇచ్చిన క్రియాశీలక కార్యకర్తల భద్రత భీమాను రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక సభ్యత్వాలు చేసిన వారిలో ఒకరిగా నిలిచి, ఒక టీం వర్క్ తో అత్యధిక సభ్యత్వాలు చేయించడం జరిగింది. ఈ విధంగా పార్టీకోసం నిరంతరం శ్రమిస్తున్న వెన్నా జగదీష్ ని గమనిస్తున్న స్థానిక జనసైనికులు నియోజకవర్గ ప్రజలు మొట్టమొదటిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ నుంచి అందరినీ కలుపుకుపోయే నాయకత్వం కనిపిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.