జనసేనానిని సీఎంగా చూడడమే నా కోరిక.. జనసేన జన జాగృతి యాత్రలో మేడ గురుదత్

  • గేర్ మార్చిన మేడ గురుదత్.. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను సీఎం గా చూడడమే తన కోరిక.. అంటున్న ఇంచార్జ్
  • జనసేన జన జాగృతి యాత్ర 29వ రోజు

రాజానగరం: కోరుకొండ మండలం, గరగలంపాలెం గ్రామంలో జనసేన జన జాగృతి యాత్రలో భాగంగా ఇంటింటికి జనసేన గాజు గ్లాసు & షణ్ముఖ వ్యూహం కరపత్రాలు జనసేన పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రతి ఇంటికి వెళ్లి జనసేన సిద్ధాంతాలను వివరించిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు ఐక్యరాజ్యసమితి అవార్డు మేడ గురుదత్ ప్రసాద్. ఇంచార్జ్ గురుదత్ ప్రసాద్ ఆధ్వర్యంలో 29రోజు జరిగిన జనసేన జనజాగృతి యాత్రకు విశేష స్పందన లభించింది.. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్న మేడా గురుదత్ ప్రసాద్ అహర్నిశలు జనసేన పార్టీ బలోపేతానికి కార్యకర్తల సహకారంతో ముందుకు దూసుకెళ్లిపోతున్నారు. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన గురుదత్ ప్రతి ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ గురించి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి వివరిస్తూ గ్రామం మొత్తం తిరిగారు. ఈ సందర్భంగా మేడ గురుదత్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ రెడ్డి గారి నిరంకుశ విధానాలతో విసిగి వేసారిపోయిన ప్రజలంతా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారని, పవనన్నని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే జీవన ప్రమాణాలు మెరుగవుతాయనే నమ్మకంతో ఉన్నారని, ఆ విషయం ఈ ప్రాంతంలో ఇంటింటికీ తిరుగుతుంటే స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. రానున్న ఎన్నికల్లో రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా రెపరెపలాడడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మందపాక శ్రీను, కో -కన్వీనర్ ముక్క రాంబాబు, చదువు ముత్తేశ్వరరావు, తన్నీరు తతాజీ, అడపా అంజి, గొల్లకోటి కృష్ణ, పోసిబాబు, రచపోతుల సురేష్, సతీష్, మెడిద వీరబాబు చల్లా ప్రసాద్ గరగలంపాలెం జనసేన పార్టీ కార్యకర్తలు గొల్లకోటి అరవింద్, రాయుడు శ్రీనివాస్, బండారి శివ, కోలా సతీష్ కుమార్, గొల్లకోటి రాము, దండిపాటి గోవింద్, అనికి కిరణ్, బొల్లి జగదీష్, యార్లగడ్డ మహేష్, కాన్యం దుర్గా ప్రసాద్, నరేష్, గొల్లకోటి కొండబాబు, పెద్దడ శివ రామ కృష్ణ, చంద్ర శేఖర్, అరుణ్, బాలు పాల్గొన్నారు.