నాదెండ్ల మనోహర్ సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకే వ్యక్తిగత విమర్శలు

  • నాదెండ్లను విమర్శించే నైతిక అర్హత అడపా శేషుకి లేదు
  • రాజకీయాల కోసం కుటుంబ సభ్యుల్ని చంపుకున్న చరిత్ర ఎవరిదో ప్రజలకి తెలుసు.
  • తెనాలి అభివృద్ధిపై నాదెండ్లది చెరగని ముద్ర.
  • సందు కెక్కువ వీధికి తక్కువ నాయకుడు అడపా శేషు.
  • గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు, రాష్ట్రంలో జరుగుతున్న జగణాసుర పాలనపై, దుర్వినియోగం అవుతున్న కోట్లాది రూపాయల ప్రజాధనంపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఆయనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాదెండ్ల మనోహర్ పై కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆళ్ళ హరి విలేకరులతో మాట్లాడారు. జనసేన పార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు నాదెండ్ల శక్తికి మించి కృషి చేస్తున్నారని కొనియాడారు. రాజకీయ లబ్ది కోసం సొంత కుటుంబ సభ్యుల్ని చంపుకున్న చరిత్ర కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న చరిత్ర కానీ నాదెండ్ల మనోహర్ కి లేవన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సభాపతిగా విశేష సేవలు అంధించటమే కాకుండా తెనాలి శాసనసభ్యుడిగా నియోజకవర్గ అభివృద్ధిపై నాదెండ్ల తనదైన ముద్రని వేసుకున్నారన్నారు. కూర్చోటానికి కుర్చీ, రాసుకోవటానికి బల్ల కూడా లేని కార్పోరేషన్ కు చైర్మన్ అయిన అడపా శేషు నాదెండ్లను విమర్శించటం సిగ్గుచేటన్నారు. కాపు కార్పోరేషన్ ద్వారా ఇప్పటివరకు కాపులకు ఎన్ని కోట్లు ఖర్చు చేసావో, కాపు జాతికి వైసీపీ ప్రభుత్వం వల్ల కలిగిన లబ్ది ఏమిటో అడపా శేషు చెప్పగలడా అని దుయ్యబట్టారు. కాపుజాతిని నిలువెల్లా మోసం చేసిన వైసీపీ పార్టీలో ఆత్మవంచన చేసుకుంటూ ఉండటం అడపా శేషులాంటి కులద్రోహులకే చెల్లిందని ధ్వజమెత్తారు. అడపా శేషులాంటి స్వార్ధపరులను కులం నుంచి కాపు జాతి ఎప్పుడో బహిష్కరించిందన్నారు. ఒక్క చాన్స్ ఒక్క చాన్స్ అంటూ ప్రజల్ని నమ్మించి అలవికాని ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తున్న విధానాన్ని నాదెండ్ల ఎండగడితే వైసీపీ నేతలకు ఎక్కడలేని కోపం వస్తుందని విమర్శించారు. రోడ్ల దుస్థితి తెలిసే 28 కిలోమీటర్ల దూరాన ఉన్న తెనాలికి కూడా సీఎం జగన్ రెడ్డి హెలికాప్టర్లో వచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. సొంత తల్లి, తోడబుట్టిన చెల్లె వదిలేసిన జగన్ రెడ్డి ప్రజలకి ఎలా బిడ్డ అవుతాడంటూ నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యల్లో అవాస్తవం ఏమీ లేదన్నారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేకే వైసీపీ నేతలు భూతులను ఎన్నుకున్నారని విమర్శించారు. నాలుగేళ్లుగా దోచుకున్నది చాలని ఇప్పటికైనా ప్రజలకి జవాబుదారీగా ఉంటూ పరిపాలన చేయాలని వైసీపీ నేతలకు ఆళ్ళ హరి హితవు పలికారు.