భగత్ సింగ్ కు నివాళులర్పించిన నడుకూరు జనసేన

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండ, నడుకూరు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు మత్స పుండరీకం మాట్లాడుతూ ‘ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ భారత యువత గుండెల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపి, బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించిన విప్లవ వీరుడు, అతి చిన్న వయసులో ప్రాణాల సైతం త్రుణప్రాయంగా దేశం కోసం త్యాగం చేసిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు భగవత్ సింగ్ అని కొనియాడారు, యువత భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకోవాల’ని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు చింత గోవర్ధన్, వాన కైలాష్, మక్క లక్ష్మీ నారాయణ, వావిలపల్లి విశ్వేశ్వరరావు, మజ్జి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.