సీఎం జగన్‌తో నాగార్జున భేటీ

ఏపీ సీఎం జగన్‌తో ప్రముఖ సినీనటుడు నాగార్జున భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన్ను కలిశారు. నాగార్జునతో పాటు నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్‌రెడ్డి సహా మరికొందరు సీఎంతో భేటీ అయినట్లు సమాచారం. సీఎం జగన్‌తో కలిసి నాగార్జున మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన వివిధ అంశాలపై జగన్‌తో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. సినీ రంగానికి వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు.