రామ్ చరణ్ సరసన బుట్టబొమ్మ..?

బుట్టబొమ్మ గా యావత్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న పూజా హగ్దే..త్వరలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం చరణ్.. ఆర్ఆర్ఆర్ తో పాటు కొరటాల శివ – చిరంజీవి కలయికలో తెరకెక్కుతున్న ఆచార్య మూవీ లో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఈ గెస్ట్ రోల్ పక్కన పూజా ను ఫిక్స్ చేశారట. ఇప్పటివరకు చరణ్ పక్కన పూజా నటించలేదు. మొదటిసారి చరణ్ పక్కన జోడి కట్టే ఛాన్స్ రావడం తో అమ్మడు కూడా వెంటనే ఓకే చెప్పిందట.