భారీ ధ‌ర‌కు అమ్మ‌డ‌వుతున్న నాని కొత్త సినిమా రైట్స్

వి, ట‌క్ జ‌గ‌దీష్ సినిమాలు థియేట‌ర్ల‌లో రిలీజ్ కాక‌పోవ‌టం, డిజిట‌ల్ రిలీజ్ అయినా రెస్పాన్స్ పెద్ద‌గా లేక‌పోవ‌టంతో నాని నిరూత్సాహంగా ఉన్నారు. న్యాచుర‌ల్ స్టార్ నాని అభిమానులు సైతం ఓ మంచి హిట్ కోసం వెయిట్ చేస్తుండ‌గా, నాని కెరీర్ లోనే కాస్ట్ లీ మూవీగా తెర‌కెక్కిన శ్యామ్ సింగా రాయ్ విడుద‌ల‌కు ముస్తాబ‌వుతుంది.

ప్ర‌స‌తుతం శ్యామ్ సింగా రాయ్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా సాగుతుండ‌గా… సినిమా రైట్స్ డీల్ క్లోజ్ చేస్తున్నారు. హిందీ రీమేక్ రైట్స్ ను బీ4యూ భారీ ధ‌ర వెచ్చించి సొంతం చేసుకోగా, డిజిట‌ల్ రైట్స్ కు నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫ‌ర్ ఇవ్వ‌టంతో చిత్ర యూనిట్ క్లియ‌ర్ చేసిన‌ట్లు తెలుస్తోంది. గ‌త రెండు సినిమాల‌తో పోల్చితే ఈ సినిమాకు ఇది భారీ ధ‌ర‌గా ఫిలింన‌గ‌ర్ టాక్.

ఈ సినిమాకు కాస్ట్ లీ సెట్స్, పెద్ద టెక్నీషియ‌న్స్, పెద్ద న‌టులు ప‌నిచేయ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి.