బొబ్బిలి జనసేన ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు

బొబ్బిలి: జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా సుక్రవారం బొబ్బిలి నియోజకవర్గం, పారాది గ్రామంలో జనసేన నాయకులు రైతుల వద్దకు నేరుగా వెళ్లి, వారి సమస్యలు గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని, బిల్లులు కూడా వేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ మూసివేయడంతో చెరుకు రైతులు పండించిన చెరుకును ఎవరికి పంపించాలో దిక్కుతోచడం లేదని ఆందోళన చెందారు. పత్తి పంట రైతులు కూడా తమ పంటను కొనే నాథుడే కరువైపోయాడని, ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడంలేదని అసహనం వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ గారికి ఈసారి తప్పకుండా ఒక అవకాశం ఇచ్చి ఆయనను గెలిపించుకుంటేనే మా యొక్క రైతు కష్టాలు తీరుతాయని వాళ్ళు చెప్పడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరి, బొబ్బిలి నాయకులు శ్రీలంక రమేష్, మండల అధ్యక్షులు సంచన గంగాధర్, సత్య, మామిడి మర్కెండేయులు, శ్రీరామ్మూర్తి, సత్యనారాయణ, రాజా, సతీష్, మౌళి, బుడి రాజా, పారాది కార్యకర్తలు దివ్య, బెల్లాన శ్రీను, సురేష్, అవినాష్, పైడి రాజు, సంతు ఉత్తరావిల్లి తదితర జనసైనికులు పాల్గొని ఈ రైతు దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది.