ప్రత్యామ్నాయ శక్తిగా అవతరిస్తున్న జనసేన పార్టీ: శివకోటి యాదవ్

తెలంగాణ, నర్సంపేట, బిసి బిడ్డగా, మీ ఇంటి బిడ్డగా ముందుకు వస్తున్న జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వండి, సుపరిపాలన అంటే ఏమిటో చూపిస్తాం. గత 30 ఏళ్ల నుంచి అగ్రవర్ణాలు పరిపాలిస్తున్న సంపూర్ణ అభివృద్ధికి నోచుకుని నర్సంపేట నియోజవర్గం. అధికార పార్టీ నేతల భూకబ్జాలు, రియల్ ఎస్టేట్ మాఫియా పెరిగాయి తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. నియోజకవర్గంలో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు విఫలం చెందాడు, సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రజల్లోకి వచ్చి హడావిడి. ఎన్నికల సమయంలో యువశక్తిని నిర్వీర్యం చేస్తూ, యువతను ప్రలోభాలకు గురిచేస్తూ పెడదోవ పట్టిస్తున్న అధికార, ప్రధాన ప్రతిపక్ష నాయకులు. ఒక జెండా,ఎజెండా లేకుండా ఎన్నికల సమయంలో స్వలాభం కోసం పార్టీలు మారుతున్న కొంతమంది అధికార, ప్రతిపక్ష నేతల తీరును ప్రజలు గ్రహించాలి, ప్రజా సంక్షేమం కోసం, యువతకు మార్గ నిర్దేశం చేస్తూ, మహిళలకు పార్టీలో సముచితగా గౌరవిస్తూ, పార్టీ భావాజాలనికి కట్టుబడి పని చేసేది జనసేన. జనసేన పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితులై పార్టీలో నియోజవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన యువత మహిళలు మహిళలు చేరడం జరిగింది. శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీలో చేరికల కార్యక్రమం సందర్భంగా నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులపై ప్రజలను ఉద్దేశించి నియోజకవర్గ ఇంచార్జ్ మేరుగు శివకోటి యాదవ్ మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వంగ మధు, ఓర్సు రాజేందర్, ఎలబోయిన డేవిడ్, బొబ్బ పృథ్వీరాజ్, వీర మహిళ నాయకురాలు కోల మౌనిక, లహరి, జనసైనికులు రవి, కార్తీక్, అభిషేక్, మిలాన్, విష్ణు, భాస్కర్, ప్రశాంత్ ప్రభాస్, మాస్, వీర మహిళలు మాధవి, శ్యామలత పార్టీలు చేరిన తదితరులు పాల్గొన్నారు.