కేంద్ర విధానాలకు నిరసగా కార్మికుల దేశవ్యాప్త సమ్మె

కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించిన ప్రైవేటైజేషన్‌ వంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా నేడు కార్మికసంఘాలు దేశవ్యాప్తంగా బంద్‌ నిర్వహిస్తున్నాయి. ఈ మేరకు పది కార్మిక సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. ఇందులో భాగంగా ఐఎన్‌టీయూసీ, హిందూ మజ్దూర్‌ సభ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. కార్మిక స్మృతులు, 2020 విద్యుత్‌ బిల్లును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. పేద కార్మికులకు ఆదాయ, ఆహార మద్దతుకు చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా నేడు విద్యుత్‌ విద్యోగుల సమ్మెలో పాల్గొననున్నారు. విద్యుత్‌ రంగంలో కేంద ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జాతీయ విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజినీర్ల సమన్వయ కమిటీ సమ్మెకు పిలుపునిచ్చింది. ఇందులో టీఎస్‌పీఈ, టీఎస్‌ఈఈ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పాల్గొననున్నది. విద్యుత్తు పంపిణీ సంస్థల ప్రైవేటీకరణకు రూపొందించిన స్టాండర్డ్‌ బిడ్డింగ్‌ డాక్యుమెంట్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.