డ్రగ్స్ కేసులో ఈడీ ముందు హాజరైన హీరో నవదీప్

టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసు, మ‌నీ లాండ‌రింగ్ అంశంలో ద‌ర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు… వ‌రుస‌గా ప‌లువురిని విచారిస్తున్నారు. ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మి, ర‌కుల్, రానా, ర‌వితేజ‌ల‌ను విచారించ‌గా… తాజాగా న‌వ‌దీప్ ను విచారిస్తున్నారు. న‌వదీప్ చేసిన అనుమానాస్పద లావాదేవీలు, డ్రగ్స్ పెడ్ల‌ర్ కెల్విన్‌తో ఉన్న సంబంధాలతో పాటు త‌న ఎఫ్ క్ల‌బ్ గురించి ఈడీ అధికారులు ఆరా తీస్తున్న‌ట్లు తెలుస్తోంది.

న‌వ‌దీప్ కు ఎఫ్ క్లబ్ ఉంది. ఎఫ్ క్ల‌బ్ కేంద్రంగానే ఈ డ్ర‌గ్స్ పార్టీలు జ‌రిగిన‌ట్లుగా ప్ర‌చారం సాగుతుండ‌గా ఎఫ్ క్ల‌బ్ మేనేజ‌ర్ ను కూడా విచారిస్తున్నారు.