COVID-19 టెస్ట్ లో జనసేనానికి నెగిటివ్

జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా చేయించుకున్న కరోనా పరీక్షల్లో నెగెటివ్ అని తేలింది. గతవారం వకీల్ సాబ్’ విడుదల కాగానే పవన్ కళ్యాణ్ ఐసోలేషన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా నిన్న ఆయన హైదరాబాద్ లోని ట్రినిటీ ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేయించుకున్నారు. దానికి సంబంధించిన ఫుటేజే అండ్ ఫోటోలే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

కాగా పవన్ చేయించుకున్న పరీక్షల్లో నెగెటివ్ అని తేలింది. పవన్ కళ్యాణ్ తన నిర్మాత నాగవంశీతో కలిసి టెస్ట్ కి వెళ్లారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది, జనసేన పార్టీకి చెందిన కీలకమైన వ్యక్తులకి కూడా కరోనా వచ్చింది. దాంతో డాక్టర్ల సలహా ప్రకారం పవన్ కళ్యాణ్ ఐదు రోజుల పాటు ఐసోలేషన్ కి వెళ్లారు. ఇక ‘వకీల్ సాబ్’ సినిమా టీంకి చెందిన దిల్ రాజు, హీరోయిన్ నివేథా థామస్ లకు ఇంకా కరోనా పాజిటివే ఉంది.

ఇక అమెరికాలో సినిమాల పరిస్థితి ఇంకా పూర్తి ఆశాజనకంగా లేకపోయినా.. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ అక్కడ మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఆశ్చర్యకరంగా ప్రీమియర్ షోల నుండే ‘వకీల్ సాబ్’ కలెక్షన్స్ చాల బాగున్నాయి. ఒక్క ప్రీమియర్ షోలతోనే 297k డాలర్ల వసూళ్లను రాబడుతుందని.. దిల్ రాజు టీమ్ కూడా ఊహించలేదు. అందుకే అమెరికా రైట్స్ ను కాస్త తక్కువ ధరకే అమ్మారు. మొత్తం మీద ఈ ఏడాది ఇంత భారీ మొత్తం పొందిన ఏకైక ఇండియన్ మూవీగా ‘వకీల్ సాబ్’ నిలిచింది.