ఎస్.జి.హెచ్.ఎమ్.ఈ.యూ క్యాలెండర్ ని ఆవిష్కరించిన నేమూరి శంకర్ గౌడ్

హైదరాబాద్ లోని ప్రశాసన్ నగర్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో స్వచ్ఛ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ( ఎస్.జి.హెచ్.ఎమ్.ఈ.యూ) కి చెందిన నూతన క్యాలెండర్ ని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు యాతం నగేష్, జిహెచ్ఎంసీ జనసేన ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి మాట్లడుతూ కార్మిక సంఘాలకి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా వుంటుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎస్.జి.హెచ్.ఎమ్.ఈ.యూ అధ్యక్షులు వై .రాజు, జనసేన కార్మిక సంఘం నాయకులు దుర్గా ప్రసాద్, యూనియన్ నాయకులు శ్రీధర్, లలిత, ధర్మేంద్ర మరియు యూనియన్ సభ్యులు పాల్గోన్నారు.