గుంటూరు జనసేన పార్టీలో నూతన చేరికలు

గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శి నాయబ్ కమాల్ సమక్షంలో ఆదివారం గుంటూరు కార్పోరేషన్ 48 వ వార్డ్ నుంచి ఎస్టి సామాజికవర్గం(నాయిక్స్) నుంచి యువత అధిక సంఖ్యలో పార్టీలో చేరడం జరిగింది. వీరికి నాయకులు పార్టీ జెండా మెడలో వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. గతంలో వీరు వైసిపి పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వారికి జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు పవన్ కల్యాణ్ గారి అశయాలు నచ్చి పార్టీలోకి చేరడం జరిగినది.

నూతనంగా పార్టీలోకి నేరెడ్ల నాని ఆధ్వర్యంలో చేరిన వారు మోతిలాల్ నాయక్, ప్రసాద్ నాయక్, రవి నాయక్, గోపి నాయక్, రామకృష్ణ నాయక్, రాంబాబు నాయక్, మను నాయక్, మోతిలాల్ నాయక్, రాకేష్ నాయక్, హనుమాన్ నాయక్, సాయి నాయక్, ముని నాయక్, నాగసాయి, గోపి, అమ్రేష్, కార్తీక్, రాఖి, ఉమా శంకర్, ఎస్ కే. జానీ కరీం, తదితరులు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్, శిఖాబాలు, సతీష్, దాసరి వెంకటేశ్వరావు, లక్ష్మిశెట్టి నాని, తన్నీరు గంగరాజు పాల్గొన్నారు.