కాకినాడ రూరల్ జనసేన పార్టీలో నూతన చేరికలు

కాకినాడ రూరల్ నియోజకవర్గం, 3వ డివిజన్ సంతన పురి కాలనీకి చెందిన యువత స్థానిక యువనాయకుడు వనమాడి మహేష్ నాయకత్వంలో జనసేన పార్టీ యువనాయకుడు శాండీ ఆధ్వర్యంలో ఆదివారం కాకినాడలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సమక్షంలో సుమారు 50 మంది జనసేన పార్టీ లో జాయిన్ అయ్యారు… వీరందరికి జనసేన పార్టీ కండువాలు వేసి పార్టీ లోకి సాధారంగా ఆహ్వానించారు… ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మండల ప్రెసిడెంట్ కార్యక్రమం కరెడ్ల గోవింద్, ముసలయ్య, వీరబాబు, తేజ, శ్రీరాములు, రాజా, ఫణి, రాజారావు, శ్రీరాములు గవర, మణి, రాజేష్, సంతోష్, ఇంటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.